|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:01 PM
షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియా ద్వారా విశేషమైన అభిమానులను సంపాదించుకున్న ఒక యువతి, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండల రజిత అనే యూట్యూబర్ సర్పంచ్‌గా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించారు.తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రంగయ్యపల్లి గ్రామ సర్పంచ్ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రజిత, తన సమీప ప్రత్యర్థిపై 37 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. గతంలో ఆమె భర్త మహేశ్ ఇదే పదవికి పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు భార్య గెలుపుతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.