|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:58 PM
TG: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఓ అధికారి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. వెంకటాపురం(M) కేంద్రంలో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే స్థానిక MPDO రాజేంద్రప్రసాద్ పోలింగ్ నేపథ్యంలో విధులకు హాజరయ్యారు. అయితే ఓట్ల లెక్కింపు జరుగుతుండగా రాజేంద్రప్రసాద్ సడెన్‌గా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.