|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:27 PM
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా సహకార సంఘం, సివిల్ సప్లై అధికారులతో వరి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. కష్టపడి ధాన్యం పండించిన రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, ఇంకా కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.