|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:27 AM
TG: రాష్ట్రంలో చలి, పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 2-3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి, ఉదయం వేళ అవసరం అయితేనే బయటకు రావాలని చెబుతున్నారు.