|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:49 PM
ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం పోలీసుల విచారణలో రవి కీలక విషయాలు వెల్లడించాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్‌వర్క్‌కు చెందిన శాటిలైట్ లింకును హ్యాక్ చేసి.. హెచ్‌డీ ఫార్మాట్‌లో సినిమాలు రికార్డు చేసినట్లు చెప్పాడు. పైరసీకి హెచ్‌డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి.. అందులో పైరసీ లింక్ అప్‌లోడ్ చేసి.. 100 - 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది.