|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:45 PM
TG: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా గత ఎన్నికల్లో రమేష్ అనే వ్యక్తి పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు.