|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 03:12 PM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే మంచి పదవి వస్తుందని, తాను ఇన్ని రోజులు ఆగితే త్వరలోనే మంత్రి పదవి వస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. గతంలో పంచాయతీలు తమకే దక్కాలని, ప్రస్తుతం ఇవ్వడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన పలుమార్లు మీడియా ముఖంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.