|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 02:36 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. 24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) టీమ్ అందుబాటులో ఉంటుందని, విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్ 100కి లేదా సమీప పోలీసులకు సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.