|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 02:58 PM
కామారెడ్డి డిగ్రీ కళాశాల వెనుక గోడ వర్షాల కారణంగా కూలిపోవడంతో కాకతీయ నగర్ కాలనీ, 14వ వార్డ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మూడుసార్లు గోడ కూలింది. మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా సంఘటనా స్థలాన్ని సందర్శించి, మున్సిపల్ అధికారులు, కళాశాల సిబ్బందికి సమాచారం అందించి, సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం చేస్తామని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్యను ప్రజలు నిలదీశారు.