|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 03:01 PM
టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి 13 రోజులు గడిచింది. ఈ నేపథ్యంలో, సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు శనివారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ నిర్మాతలతో మరోసారి చర్చలు జరపనున్నారు. నిర్మాతల షరతులపై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్‌లో చర్చించిన తర్వాత కార్మిక నేతలు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. మరోవైపు, ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు ఈ అంశంపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.