|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:51 AM
కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువు ఆధునికరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. మల్కాపూర్ నుంచి కల్ప గురు వరకు 5 కిలోమీటర్ల మేర చెరువు ఆధునికరణ జరుగుతుందని, అలాగే వికారాబాద్ జిల్లా వనంపల్లి నుంచి మల్కాపూర్ చెరువు వరకు 15 కిలోమీటర్ల ఫీడర్ ఛానెల్ అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.