|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:33 AM
శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు శంషాబాద్ మున్సిపాలిటీలో ప్రజల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాపారులు, విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు, ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి కూడా తన మద్దతును ప్రకటించి సంతకం చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీని ఏడు గ్రామాలను కలుపుతూ జిహెచ్ఎంసిలో విలీనం చేయడం సంతోషమే అయినా, శంషాబాద్ ను చార్మినార్ జోన్ లో కలపడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు