|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 03:07 PM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా BRR ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి మాట్లాడుతూ, యువత డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, సైబర్ క్రైమ్ వంటి వాటికి దూరంగా ఉండి, ఆటల పోటీలపై దృష్టి పెట్టాలని సూచించారు.