|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 03:08 PM
యూరియా కోసం రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అష్టకష్టాలపాలు చేస్తుందని BRS నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. 'దేశంలో ప్రజలు అత్యంత సొంతం చేసుకున్న నినాదం జై జవాన్, జై కిసాన్. ఆ నినాదాన్ని ఇచ్చిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది. అదే కాంగ్రెస్ నై కిసాన్, నై యూరియా అంటోంది. యూరియా కూడా సరఫరా చేయలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం' అని విమర్శించారు.