|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 01:14 PM
హైదరాబాద్‌లో పట్టపగలే ఖజానా జువెల్లర్స్ దుకాణంలో కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బీదర్‌లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.హైదరాబాద్‌లో పట్టపగలే ఖజానా జువెల్లర్స్ దుకాణంలో కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బీదర్‌లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.కాగా, దోపిడీ ముఠా నెల క్రితమే బీహార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేరారు. బీహార్ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకొని, కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. దోపిడీ అనంతరం ఇక్కడి నుంచి పరారయ్యారు.