|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 01:06 PM
TG: సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన నేరాంగీకార పత్రంలో కీలక విషయాలు బయటపడ్డాయి. సరోగసి పేరుతో ఒక్కో కేసుకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు డబ్బుల ఆశ చూపించి, శిశువులను విక్రయించే ఒప్పందాలు చేసుకున్నారని, ప్రసవం తర్వాత తల్లుల నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లు పత్రంలో నమోదు అయింది.