|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:57 PM
పటాన్చెరు : శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించిన జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని.. స్వామివారిని దర్శించుకున్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. అనంతరం ఆలయ ధర్మకర్త, స్థానిక కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్.. ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.