|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:53 PM
హైదరాబాద్‌లో మరో అక్రమ సరోగసి ముఠా. పిల్లలు లేని వారిని టార్గెట్ చేసుకొని రూ.20 లక్షలు వసూలు చేస్తున్న తల్లీకొడుకులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పేట్‌బషీరాబాద్ ప్రాంతంలో పేద మహిళలను టార్గెట్ చేసి అండాలు, గర్భానికి వెలకట్టి అక్రమ సరోగసీ దందా నడిపిస్తున్న తల్లీకొడుకులు లక్ష్మీరెడ్డి(45), నరేందర్రెడ్డి(23)లను అరెస్ట్ చేసిన మేడ్చల్ పోలీసులు. ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన నర్రెద్దుల లక్ష్మీరెడ్డి భర్తతో విడిపోయి మహారాష్ట్రకు వెళ్లి అండాలు విక్రయించి సరోగసీ ద్వారా డబ్బు సంపాదిస్తూ, అక్కడనుండి పిల్లలను ఎత్తుకొచ్చి ఏపీలో విక్రయించడంతో ఆమెను అరెస్టు చేసిన ముంబై పోలీసులు . జైలు నుండి విడుదలైన అనంతరం హైదరాబాద్‌లోని సుచిత్ర సమీపంలో ఒక భవనం నిర్మించుకొని, జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడుకును ఏజెంట్‌గా మార్చుకొని అక్రమ దందా కొనసాగిస్తున్న లక్ష్మీరెడ్డి. హైదరాబాద్ నగరంలోని 6 ఫెర్టిలిటీ సెంటర్లతో అనుబంధం ఏర్పాటు చేసుకొని, ఏజెంట్ల ద్వారా పేద మహిళల అండాలు సేకరించి, సంతానం లేని దంపతుల నుండి రూ.10- 20 లక్షలు వసూలు చేసిన తల్లీకొడుకులు. లక్ష్మీరెడ్డి ఇంటికి తరచూ మహిళలు వచ్చి వెళ్తుండడం గమనించి అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు . ఆమె ఇంటిపై దాడి చేసి గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు, బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, రూ.6.47 లక్షల నగదు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని, తల్లీకొడుకులను అదుపులోకి తీసుకున్న మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి ఉమాగౌరీ, మేడ్చల్ ఎస్ఓటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు. లక్ష్మీరెడ్డికి హెగ్దే ఫెర్టిలిటీ హాస్పిటల్(మాదాపూర్), అను టెస్ట్ ట్యూబ్ సెంటర్(సోమాజిగూడ), ఫెర్టికేర్(బంజారాహిల్స్), ఈవీఎఫ్ ఐవీఎఫ్, అమూల్య ఐవీఎఫ్ సెంటర్, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్(కొండాపూర్)లతో సంబంధం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు