|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 10:42 AM
ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక , మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల, శ్రీశైలం జలశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీటి విడదుల చేస్తున్నారు. దీంతో సాగర్ ఓవర్ ఫ్లో అయ్యే పరిస్థితి తలెత్తడంతో ఇవాళ ఉదయం అధికారులు మొత్తం 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 1,74,533 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి వాటర్ లెవల్ 590 అడుగులు.. కాగా ప్రస్తుత వాటర్ లెవల్ 589.30 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 309.95 టీఎంసీలుకు చేరింది. 24 గేట్లు ఎత్తడంతో చుట్టుపక్కల జిల్లాలు, మండలాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు నాగర్జున సాగర్‌కు వస్తున్నారు. డ్యామ్ వద్ద సెల్ఫీలు, స్నేహితులతో సరదాగా గడుపుతూ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.