|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 10:46 AM
TG: ఇంటర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. జోగులాంబ జిల్లాకు చెందిన హరికృష్ణ(21) కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ బాలిక(16)తో ఇన్‌స్టాలో పరిచయం పెంచుకున్నాడు. జూన్‌లో బాలికను ఐడీపీఎల్ టౌన్‌షిప్‌లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఎవరికీ చెప్పొద్దని సూచించాడు. మరో రెండుసార్లు కోరిక తీర్చుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు.