|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:42 PM
TG: రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో సీఎం రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో BRS సత్తాచాటి 40 శాతం అంటే 4వేలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచిందని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని హరీష్ రావు మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో వచ్చేది BRS ప్రభుత్వమేనని సర్పంచ్ల ఐదేళ్ల పదవీకాలంలో మిగిలిన మూడేళ్లు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉంటారని అన్నారు.