|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:21 PM
మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదని, ఢిల్లీకి, హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టే ఫ్లయింగ్ సీఎం అని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, సర్పంచ్‌ల పదవీకాలంలో మిగిలిన మూడేళ్లు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉంటారని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, కారు జోరుతో కాంగ్రెస్ బేజారైందని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90 శాతం గెలిస్తే, ప్రతిపక్ష పార్టీలు 10 శాతం గెలుస్తాయని పేర్కొన్నారు.