|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:33 PM
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, గత ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మారంపల్లి శేఖర్, నాయకులు మారంపల్లి నర్సింహ, మారంపల్లి దుకాణం నర్సయ్య సుమారు 50 మందితో కలిసి శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి తాము కాంగ్రెస్ లో చేరినట్లు వారు తెలిపారు.