|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:06 PM
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. విజయనగరం జిల్లాలోని చారిత్రక బొబ్బిలి కోటను సందర్శించిన ఆయన, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి కోటలోని మ్యూజియంను సందర్శించి, బొబ్బిలి రాజుల వంశవృక్షాన్ని, వాడిన వస్తువులను పరిశీలించారు.బొబ్బిలి రాజుల చరిత్ర ఎంతో గొప్పదని, రెండు శతాబ్దాల నాటి వస్తువులను జాగ్రత్తగా భద్రపరచడం అభినందనీయమని మల్లారెడ్డి ప్రశంసించారు. పర్యటనలో భాగంగా ఆయన తాండ్రపాపారాయుడు ఉపయోగించిన కత్తిని చేతబట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు. కోట విశేషాలను వివరించిన ఎమ్మెల్యే బేబినాయనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.