|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 10:52 AM
అన్ని ముదిరాజ్ సంఘాలు ఐక్యతతో ముందుకు సాగితేనే మన జాతి హక్కులు సాధించుకోవడం సాధ్యపడుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం హైదరాబాద్ మేడ్చల్ పరిధిలోని కండ్లకోయ నిమ్మల కన్వెన్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి (TMPS) ఆవిర్భావ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముదిరాజ్ హక్కుల కోసం పోరాడిన మహానేత స్వర్గీయ ఎర్ర సత్యం వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముదిరాజ్ సమాజానికి చెందిన Phd పూర్తి చేసిన 25 మంది స్కాలర్స్ ను సత్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నీలం మధు మాట్లాడుతూ ముదిరాజ్ జాతి హక్కుల సాధనకు తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మత్స్యకారుల దిర్గకాలిక సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా టిఎంపిఎస్ ను ఏర్పాటును తను స్వాగతిస్తున్నానని ఈ సంస్థకు తన సంపూర్ణ మద్దతు అందిస్తానని స్పష్టం చేశారు. మన ముదిరాజ్ జాతి మనుగడ కోసం మన హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమించేలా టీఎంపీఎస్ చొరవ తీసుకోవాలని సూచించారు. ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే మన హక్కులని సాధించుకోవచ్చన్నారు. అందుకు ప్రతి ముదిరాజ్ బిడ్డ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు మన జాతి బిడ్డలు రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేశారని ఆ కుట్రలను చేధించుకుని మనం రాజకీయంగా ఎదగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో మెజార్టీగా ఉన్న ముదిరాజులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి ఎంపీపీలుగా, జడ్పిటిసిలుగా, సర్పంచులు గా రాణించాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పది నుంచి 15 మంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మన జాతి బిడ్డలు పోటీ చేసేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. మన హక్కుల సాధన తో పాటు రాజకీయంగా మన జాతి బిడ్డలు రాణించాలంటే రాజకీయ జేఏసీగా ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.