|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 11:18 AM
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ముదిరాజ్ కాలనీలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టు మొక్క అటూ ఇటూ కదులుతుండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. రాఖీ పౌర్ణమి రోజు ఉదయం 9 గంటల సమయంలో ఈ చింత చెట్టు మొదటిసారి కదిలిందని, మళ్లీ ఈ నెల 12వ తేదీన కూడా అదే విధంగా కదిలిందని స్థానికులు చెబుతున్నారు. ఈ వింతను చూసిన ప్రజలు ఇది దేవుడి మహిమ అని, బ్రహ్మంగారు చెప్పినట్టుగా అన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.