|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 06:33 PM
తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రోజులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్- మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ ఇవ్వగా.. ఆదిలాబాద్, హైదరాబాద్, హనుమకొండ, కామారెడ్డి, జనగామ, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్.. నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంగనర్, సిరిసిల్ల జిల్లాలలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే నాలుగు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. వచ్చే 72 గంటల పాటు యంత్రాంగం అంతా అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, సిబ్బందిని అలర్ట్ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల సెలవులను సైతం ప్రభుత్వం రద్ది చేసింది. వర్షాల నేపథ్యంలో 5 జిల్లాల్లో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చారు.