|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 06:22 PM
పటాన్చెరు : ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన కంచర్ల శోభ, గుమ్మడిదల గ్రామానికి చెందిన మహేష్ యాదవ్ లు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కంచర్ల శోభ వైద్య చికిత్స నిమిత్తం ఐదు లక్షల రూపాయలు, మహేష్ యాదవ్ చికిత్స నిమిత్తం రెండు లక్షల 50వేల రూపాయలు ఎల్ఓసిలు మంజూరయ్యాయి. బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్ఓసిలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసి లతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నమని తెలిపారు.