|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 06:03 PM
తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. లష్కర్ నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరూ విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు. కాలువలు, చెరువులు, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని వెల్లడించారు.