|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 05:57 PM
ఈరోజు శేరిలింగంపల్లి మసీద్ బండ ప్రాంతంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుడు సాయి నందన్ ముదిరాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాయి నందన్ కి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మారబోయిన రవి యాదవ్ శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యం తో నిండు నూరేళ్లు చల్లగా బతకాలని ఆ భగవంతుడిని అమ్మవారిని కోరుకుంటున్నామని రవి యాదవ్ తెలియజేశారు. ఈ శుభ సందర్భంగా సాయి నందన్ ముదిరాజ్ మాట్లాడుతూ నా జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పుట్టినరోజు ఇంత ఘనంగా ప్రత్యేకంగా చేసిన మా అన్న మరబోయిన రవి యాదవ్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు అన్న. ఈ కార్యక్రమంలో మల్లేష్ ముదిరాజ్, రవికుమార్, గడ్డం శ్రీనివాస్, కొండకల శ్రీనివాస్, నవీన్ గౌడ్, జమ్మయ్య, శ్రీకాంత్ యాదవ్, బుయ్య మలేష్ గౌడ్, వడే శ్రీనివాస్, మున్నా, పవన్, మహేష్, స్వామి ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, కే.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.