|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 06:54 PM
ప్రజావసరాలకు ఉద్దేశించిన స్తలాలను కాపాడిన హైడ్రాకు కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్కిల్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ కాలనీ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వగానే చర్యలు చేపట్టిన హైడ్రాకు అభినందనలు తెలిపారు. భగత్‌సింగ్ నగర్ నుంచి వందలాదిగా తరలి వచ్చి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని కలసి అభినందనలు తెలిపారు. ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసిన సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 3500ల గజాల స్థలం కాగా.. వెయ్యి గజాలకు పైగా కబ్జా అయ్యిందని వాపోయారు. హైడ్రా రంగంలోకి దిగకపోతే మొత్తం కబ్జాలపాలయ్యేదని అన్నారు. ఇటీవల వచ్చిన నిర్మాణాలను తొలగించి మొత్తం 3500ల గజాల స్థలాన్ని కాపాడి ఫెన్సింగ్ వేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.