|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 06:58 PM
పరిగి మునిసిపాలిటీలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పరిగి మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో రచయిత జర్నలిస్టు హైదరాబాద్ మాజీ మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి 132వ జయంతి కార్యక్రమాన్ని పరిగి మున్సిపాలిటీ సంఘం అధ్యక్షులు దోమ శ్రీశైలం ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.శ్రీ కృష్ణస్వామి ముదిరాజ్ గారు బహుముఖ ప్రజ్ఞశాలి, రచయిత, జర్నలిస్ట్, విద్యావేత్త మరియు హైదరాబాద్ పై ఒక కళాఖండంగా నిలిచిన 'పిక్టోరియల్ ఆఫ్ హైదరాబాద్' రచయిత మరియుకొంతకాలం పాటు ఆయన అప్పటి ప్రధానమంత్రి మహారాజ్ కృష్ణ ప్రసాద్ కు ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు. కొర్వి కృష్ణ స్వామి గారు 'డెక్కన్ స్టార్' అనే ఇంగ్లీష్ వారపత్రిక మరియు 'మసావత్' అనే ఉర్దూ వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆయన "న్యూ ఎరా" కు కూడా సంపాదకుడిగా పనిచేశారు మరియు సియాసత్, రాయత్, రహ్నుమా-ఎ-డెక్కన్, ఎమ్రోజ్ వంటి అనేక ఉర్దూ దినపత్రికలలో కాలమ్స్ రాశారు.
క్రిష్ణ స్వామి ముదిరాజ్ గారు 25 సంవత్సరాలు కౌన్సిలర్ గా మరియు మేయర్‌గా ఉన్న సమయంలోనే హైదరాబాద్ కోసం ఒక మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్ మేయర్‌గా ఆయన అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను కలిశారు మరియు యుగోస్లేవియా అధ్యక్షుడు మార్షల్ టిటోకు పౌర స్వాగతం పలికారు. శ్రీ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ గారు హైదరాబాద్ లో మాన్యువల్ రిక్షా లాగడం వ్యవస్థను తొలగించడానికి మరియు సైకిల్ రిక్షాలను ప్రోత్సహించడానికి బాధ్యత వహించారు. శ్రీ కొర్వి కృష్ణ ముదిరాజ్ గారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌తో సామాజిక సంక్షేమం గురించి క్రమం తప్పకుండా అభిప్రాయాలను పంచుకున్నారు. శ్రీ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ 1922లో నిజాం రాజ్య ముదిరాజ్ మహాసభను స్థాపించారు మరియు తరువాతి 40 సంవత్సరాలు మహాసభకు అధ్యక్షుడిగా ఉన్నారు మరియు ముదిరాజ్ సమాజానికి మరియు నగరంలోని ఇతర బలహీన వర్గాలకు విద్యారంగంలో ఎంతో సేవ చేశారు. కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ గారు ముదిరాజ్ సంఘం ఏర్పాటు మాత్రమే కాకుండా ఇతర కుల సంఘాల ఏర్పాటు కూడా కృషి చేయడం జరిగిందిమహిళా అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ఆయన అనేక గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు మరియు హిందీ కన్యా పాఠశాలను స్థాపించారు. కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని, హైదరాబాదులో ఒక యూనివర్సిటీకి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి పేరు పెట్టాలనికి ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా జీవో నంబర్ 15ను అమలు చేసి ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ-ఏ లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు దోమ రామచంద్రయ్య ముదిరాజ్, నియోజకవర్గ కార్యదర్శి డి. కృష్ణయ్య ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. మాణిక్యం ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, పరిగి నియోజకవర్గం యువత అధ్యక్షులు పర్షమోని బాబు ముదిరాజ్, సంఘం నాయకులు జనార్థన్ ముదిరాజ్, మహిపాల్ ముదిరాజ్, కృష్ణా ముదిరాజ్, బందయ్య ముదిరాజ్, డి. ప్రవీణ్ ముదిరాజ్, ఆనంద్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.