|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 06:40 PM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బహుజన చక్రవర్తి,దళిత బహుజన విప్లవ వీరుడని కొనియాడారు.జనగామ జిల్లా రఘునాధపురం మండలం కిలషాపూర్ గ్రామంలో జన్మించిన సర్ధర్ సర్వాయి పాపన్న గారు ఎలాంటి వారసత్వం నాయకత్వం లేకున్నా బహుజన చక్రవర్తిగా మొగల్ పాలకుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచాడన్నారు.బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం వస్తుందని పాపన్న గారు ఆనాడే నిరూపించారు.ప్రజలకు ఎలాంటి పన్నులు వేయకుండా పాలించిన యోధుడు పాపన్న గారు అని అన్నారు.గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు పాలించి తెలంగాణ రాష్ట్ర శివాజీకి వెలుగొందడరాని ఆయన కొనియాడారు.చాకలి సర్సన్న,మంగలి మాసన్న,కుమ్మరి గోవిందు,జక్కుల పెరుమల్లు,దూదేకుల వారితో కలిసి దిరాల గద్దెపైన మెరుపుదాడిచేశారన్నారు.12 మందితో కలసి 12 వేల సైన్యం తయారుచేసారన్నారు.సర్దార్ సర్వాయిపాపన్న గారి అడుగు జాడల్లో నడిచి వారి ఆశయాలను సాధించాలన్నారు.