|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 06:38 PM
సీఎం రేవంత్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రో.కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రినిసిపల్ ప్రో.కాశీం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 21న ఓయూలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎంను ఆహ్వానించారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 హాస్టల్స్ ప్రారంభంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో నిర్మించే 2 హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.