|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 06:37 PM
TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి గుడ్‌న్యూస్. వీరికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఈసారి లబ్దిదారులకు బియ్యంతో పాటు సంచిని ఇవ్వనున్నారు. అటు కేంద్రం ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి 3 నెలల కోటా బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో జులై, ఆగస్టులో రేషన్ షాపులను మూసివేశారు. సెప్టెంబర్ నుంచి పాత పద్ధతిలో నెలవారీ కోటాను పంపిణీ చేయనున్నారు.