|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:33 PM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలిపోయిన ఇళ్లలో ఉండకుండా, అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. మండల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.