|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 08:13 PM
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు చేశారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కడుతా అంటూ రేవంత్ రెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పూర్తి స్థాయిలో సైబరాబాద్ సిటీ నిర్మించడానికే సుమారు 25 ఏళ్ల సమయం పట్టిందని అన్నారు. అలాంటిది ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించాలని వెల్లడించారు. అప్పటి వరకు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.