|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 03:23 PM
శిథిలావస్థ నిర్మాణాలు, సెల్లార్ల తవ్వకాల పురోగతిపై GHMC కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 685 శిథిలావస్థ నిర్మాణాల్లో 327 నిర్మాణాలపై చర్యలు తీసుకున్నట్టు బుధవారం తెలిపారు. మిగిలిన 358 నిర్మాణాలపై త్వరలో చర్యలు ఉంటాయన్నారు. గ్రేటర్లో 154 సెల్లార్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా 61 ప్రదేశాలలో పనులు కొనసాగుతున్నాయి. అనుమతి లేని 52 సెల్లర్లను సీజ్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.