|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 03:23 PM
తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా నార్త్ GHMC ఏరియాలో 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.