|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 03:29 PM
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలం ఐనాపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ తోట అనిల్ (30) పంజాబ్‌లో అదృశ్యమయ్యాడు. 11 ఏళ్లుగా అంబాల వద్ద సేవలందిస్తున్న అనిల్, ప్రమోషన్ అనంతరం ట్రైనింగ్ తీసుకుని సెలవులు గడిపి ఆగస్టు 6న విధులకు చేరాడు. ఆగస్టు 8న కుటుంబానికి “చనిపోతున్నా” అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు. అప్పటి నుంచి ఆచూకీ తెలియక, కుటుంబం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోరుతోంది.