|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 05:15 PM
ఫ్యూచర్ సిటీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ అంశం తెరపైకి తేవడమే ఒక కుట్ర . రైతుల వద్ద ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను ఫ్యూచర్ సిటీకి తరలించడం కుదరదని రెండేళ్ల క్రితం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని హెచ్చరించాను . ఆ విషయాన్ని ప్రభుత్వం ఆలస్యంగా తెలుసుకుంది. ప్రచారాల కోసం వందల కోట్లు ఖర్చు చేసి, ఫ్యూచర్ సిటీ అని రైతులను, ప్రజలను మోసం చేశారు. పాలన మీద అవగాహన లేని రేవంత్ రెడ్డి లాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించడం వల్లనే, ఈరోజు రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉంది అని కేటీఆర్ అన్నారు