|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 05:11 PM
తెలంగాణ టూరిజం సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 19న నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాలు మొదలుకానున్నాయి. ఇందుకు డబుల్ డెక్కర్ ఏసీ లాంచీలు, మినీ లాంచీలు, స్పీడ్ బోట్లను సిద్ధం చేశారు. కృష్ణా నదిలో 120 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. పెద్దవారికి రూ.2 వేలు, చిన్నపిల్లలకు రూ.1,600 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు.