|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 08:11 PM
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ఇండిగో ఎయిర్ వేస్‌లో వచ్చిన మహిళ దగ్గర కస్టమ్స్ అధికారులు 13.3కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా గత నెల కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.40కోట్లు విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.