|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 07:13 PM
TG: మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని పూజారులు, అధికారులు మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకూ రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని వెల్లడించారు. ఏటా భారీ వరద పోటెత్తడంతో అమ్మవారి ఆలయాన్ని ఇలా మూసివేస్తారు.