|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 07:11 PM
తెలంగాణలో మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 'రాష్ట్రంలో BRS పని కూడా అయిపోయింది. కోదండరాం కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యమం చేశారు. అదృష్టం ఉండి కేసీఆర్ సీఎం అయ్యాడు. కోదండరాం వెనక పడ్డాడు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం చట్టసభల్లో ఉండాలనే ఎమ్మెల్సీ ఇచ్చాం. సుప్రీం కోర్టు తుది తీర్పు తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తాం' అని స్పష్టం చేశారు.