|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 12:29 PM
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి రోడ్లపై వరద ప్రవహిస్తోంది. లావుడితండ–రామన్నపేట మధ్య లోలెవెల్ వంతెనపై వరద ఉధృతి కొనసాగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, రైతులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ జిల్లాలో సెలవులు ప్రకటించకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ వంతెనపై బ్రిడ్జి నిర్మించాలని దశరథ నాయక్ కోరారు.