|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 12:34 PM
రామచంద్రపురం : అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బిహెచ్ఇఎల్ పరిశ్రమ యాజమాన్యాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం బిహెచ్ఎల్ పరిశ్రమ అడ్మిన్ కార్యాలయంలో పరిశ్రమ ఈడి భరణి రాజాతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. ప్రధానంగా పరిశ్రమలో చేపడుతున్న ఉద్యోగాల భర్తీలో స్థానిక యువతకు ప్రాధాన్యత కల్పిస్తే నిరుద్యోగ సమస్యతోపాటు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఈడి భరణి రాజా ఇటీవల 515 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని.. అర్హత కలిగిన నిరుద్యోగులు అందరూ సెప్టెంబర్ 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరు నియోజకవర్గానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని.. భవన నిర్మాణం కోసం సి ఎస్ ఆర్ ద్వారా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు. దీంతోపాటు ఇక్రిస్సాట్ ఫెన్సింగ్ ఏరియాలో గల పురాతన దేవాలయాన్ని పునర్నిర్మానం చేయాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాల భవనం నిర్మాణం పూర్తయితే స్థానిక విద్యార్థులకు మెరుగైన విద్య అందుబాటులోకి వస్తుందని కోరారు. త్వరలోనే సంస్థ ఉన్నత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిహెచ్ఈఎల్ ఏజిఎం సురన్ ప్రసాద్ పాల్గొన్నారు.