|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 12:56 PM
శ్రావణ మాస బోనాల సందర్భంగా, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపీనగర్ గోవర్ధనగిరి గుట్టలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, అనంతరం నిర్వహించిన తోటేలా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్. రవి యాదవ్ మాట్లాడుతూ....అమ్మవారి అనుగ్రహం మన ప్రాంత ప్రజలందరికీ సుఖశాంతులు, ఆరోగ్యం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. మన సంప్రదాయాలను కాపాడుకుంటూ సామాజిక ఐక్యతను బలపరచాలని ఆశిస్తున్నాను". ఈ కార్యక్రమంలో కే.ఎన్. రాములు, మల్లేష్ ముదిరాజ్, స్వామినాథ్, గడ్డం శ్రీనివాస్, నవీన్ గౌడ్, శంకర్, సతీష్ గౌడ్, గంగాధర్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రవి, మున్నా, సురేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, వడే శ్రీనివాస్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.