|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 12:27 PM
హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచి మబ్బు వాతావరణం నెలకొని, కొద్దిసేపటి క్రితం వర్షం ప్రారంభమైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో పలు జిల్లాల్లోనూ ఉదయం నుంచి జల్లులు పడుతున్నాయి.జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు ఉండనున్నాయి.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అలర్ట్ గా ఉండాలని.. సెలవులు రద్దు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.