|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 12:21 PM
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పార్టీ నేతలతో మాట్లాడిన కేటీఆర్రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని పిలుపునిచ్చిన కేటీఆర్. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలని.. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైనచోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని కోరిన కేటీఆర్